భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని సినిమా థియేటర్లను ఈనెల 31వరకు బంద్ చేస్తున్నట్లు థియేటర్ యజమానులు వెల్లడించారు. కొవిడ్-19 వైరస్ వ్యాప్తి నివారించేందుకు ముందస్తు జాగ్రత్తగా సర్కార్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇల్లందులోని సీతారామ, లలిత్, కళాంజలి థియేటర్ల ముందు ప్రభుత్వ సూచనల కారణంగా సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నామని నోటీసు బోర్డును ఏర్పాటు చేశారు. నిత్యం జన సంచారంతో ఉండే సినిమా హాళ్లు జనాలు లేక వెలవెలబోతున్నాయి.
- ఇదీ చూడండి : 'ముఖ్యమైనది చెప్పాలనుకున్నాం.. కరోనా చెడగొట్టింది'