భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి, మొగల్స్ని ఎదిరించిన యోధుడిగా శివాజీ నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేసి, పుర వీధుల్లో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణ వీధులు వీహెచ్పీ, భజరంగ్ దళ్ కార్యకర్తల శివాజీ నినాదాలతో మారుమోగింది.
ఇవీ చూడండి: దారుణం: గొంతుకోసి బ్యాంకు ఉద్యోగిని హత్య