జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా భద్రాచలంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహన ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. సీఐ స్వామి, ట్రాఫిక్ ఎస్ఐ సురేశ్, టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు శిరస్త్రాణ ప్రాధాన్యతపై ర్యాలీ చేస్తూ.. అవగాహన కల్పించారు.
పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ సెంటర్ మీదుగా కొనసాగింది. ర్యాలీలో పట్టణ యువకులతో పాటు సివిల్, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ పెట్టుకొని వాహనం నడపాలని.. ప్రమాదాలను అరికట్టాలని సీఐ సూచించారు.
ఇదీ చూడండి: పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్