భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని 6, 8, 9, 10 వార్డుల పరిధిలో జిల్లా అదనపు కలెక్టర్వెంకటేశ్వర్లు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆరంభించి, పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పారిశుద్ధ్య వారోత్సవాల్లో ఇల్లందు పట్టణాన్ని పూర్తి పరిశుభ్రమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ అన్నారు.
పారిశుద్ధ్య, డ్రైనేజీ పనులు ముమ్మరంగా నిర్వహించాలని, ఎక్కడా.. మురుగు నీరు, నిల్వనీరు లేకుండా చూసుకోవాలని అన్నారు. రోడ్లపై సైతం నీరు నిల్వకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పురపాలక ఛైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు, వైస్ ఛైర్మన్ జాని, తహశీల్దార్ మస్తాన్ రావు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్లు, ప్రత్యేకాధికారులు, ఇతరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా