ETV Bharat / state

'సర్వం సిద్ధం.. నాలుగు కేంద్రాల్లో టీకా కార్యక్రమం' - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు

కొవిడ్​ టీకా అందించడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్​ ఎన్​వీ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఇల్లందులో పర్యటించిన ఆయన వ్యాక్సిన్​ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు.

bhadradri kottagudem collector told  vaccination program at four centers in the  district
జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో టీకా కార్యక్రమం: ఎన్​వీ రెడ్డి
author img

By

Published : Jan 15, 2021, 5:55 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా నాలుగు కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేశామని కలెక్టర్​ ఎన్​వీ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఇల్లెందులో పర్యటించిన ఆయన అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్​ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజా ప్రతినిధులు, వైద్యాధికారుల సమక్షంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు.

జిల్లాలో మెుత్తం నాలుగు కేంద్రాలలో కొవిడ్​ వ్యాక్సినేషన్​ కార్యక్రమం నిర్వహిస్తామన్న కలెక్టర్​... కొత్తగూడెంలో 2, భద్రాచలంలో 1, ఇల్లెందులో 1 కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శనివారం 120 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నామని చెప్పారు. టీకా పట్ల అపోహలొద్దన్న ఎన్​వీ రెడ్డి ఎటువంటి వ్యాక్సిన్ అయినా కొందరిలో రియాక్షన్ సమస్యలు వస్తాయని వివరించారు. అలాంటి వారికి చికిత్స అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

మెుదటి దశలో వైద్యఆరోగ్య సిబ్బందికి టీకా ఇచ్చి వారిని 30 నిమిషాల పాటు వారిని పరిశీలనలో ఉంచునున్నట్లు కలెక్టర్​ తెలిపారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతి విద్యార్థులకు తరగతులు పారంభం కానుండండంతో ఇల్లందులోని ఓ పాఠశాలను పరిశీలించిన ఆయన​ పలు సూచనలు చేశారు.

ఇదీ చదవండి: అపోహలొద్దు.. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి: రమేశ్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.