ఎడతెరిపి లేని వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెంలోని మన్యం వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుండాల మండలం చుట్టూ ఉన్న కిన్నెరసాని, ఏడుమెలికల, జల్లేరు, ఎద్దరేవు, రాళ్ల, తొట్టి వాగులు పొంగిపొర్లుతున్నాయి. మల్లన్న వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు ఆలస్యం కావడం వల్ల తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన చాలాసార్లు కొట్టుకుపోయింది.
ఏటా వాగులు పొంగడం... గుండాల ఏజెన్సీ చుట్టుపక్కల సుమారు 30 గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోవడం సర్వసాధారణంగా మారింది. గర్భిణీలు, వృద్ధులు, చిన్న పిల్లల పరిస్థితి దారుణంగా ఉంటోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏజెన్సీ మండలాల్లో అభివృద్ధి పనులపై దృష్టి సారించాల్సింగా ప్రజలు కోరుతున్నారు.