ETV Bharat / state

పట్టు బిగించారు.. చివరికి కరోనా ఆట కట్టించారు... - పట్టు బిగించారు.. చివరికి కరోనా ఆట కట్టించారు...

తొలినాళ్లలో కేంద్రం జాబితాలో ఉన్న ఆ జిల్లాలో 21 రోజులుగా ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ఎలాగైనా కరోనా మహమ్మారిని తమ జిల్లా గుమ్మం దాటించాలని నిశ్చయించుకున్న జనం... ఇంటి పట్టునే ఉన్నారు. నిరంతరం తీవ్రంగా శ్రమించిన యంత్రాంగం వైరస్‌ వ్యాప్తిని కట్టిడి చేయడంలో చివరికి విజయం సాధించారు.

BHADRADRI KOTHAGUDEM PEOPLE FIGHTS AGAINST  CORONA VIRUS
పట్టు బిగించారు.. చివరికి కరోనా ఆట కట్టించారు...
author img

By

Published : Apr 15, 2020, 2:29 PM IST

భద్రాద్రి కొత్తగూడెం ప్రజల్లో 15 రోజుల క్రితం ఎన్నో భయాందోళనలు. జిల్లాలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. రోజులు గడిచేకొద్దీ ఎన్ని కేసులు నమోదవుతాయోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలను పకడ్బందీగా అమలు చేశారు. భద్రాద్రి రామాలయంలో సీతారాముల కల్యాణం, శ్రీరాముని పట్టాభిషేకం క్రతువులు కూడా నిరాడంబరంగా నిర్వహించారు.

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి, వేర్వేరు కుటుంబాలకు చెందిన మరో ఇరువురుకి వైరస్‌ సోకింది. వీరిలో ప్రస్తుతం ఇద్దరు డిశ్ఛార్జి అయ్యారు. సూటీగా, స్పష్టంగా ఒక్క మాటలో చెప్పాలంటే.. గత 21 రోజులుగా జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ పరిణామాల వెనుక కలెక్టర్‌ ఎంవీ రెడ్డి సూక్ష్మ దృష్టి, ఎస్పీ సునీల్‌దత్‌ భద్రతా చర్యలు, అధికార యంత్రాంగం కృషి ఉన్నాయి. వీటన్నింటి కంటే ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా గ్రామీణులు స్వీయ నియంత్రణ, స్వీయ నిర్బంధం పాటించారు. గిరిజన తండాలు, గూడెంలలో భౌతిక దూరం పాటించారంటే అతిశయోక్తికాదు.

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కరోనా నివారణ చర్యలపై జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్‌లో మార్చి 28న నిర్వహించిన సమీక్ష సమావేశం కూడా వైరస్‌ కట్టడికి ఉపయోగపడింది. ప్రభుత్వం తరుపున కావాల్సిన వసతులు, సౌకర్యాలను వేగిరం చేయగలిగారు. తాగునీరు, వ్యవసాయ పనులు, నిత్యావసరాలు, అత్యవసరాలకు వెళ్లినపుడు గ్రామీణులు ముందు జాగ్రత్తలు పాటించారు. అటు అధికార యంత్రాంగం, ఇటు ప్రజానీకం సమన్వయంతో కరోనా వైరస్‌ను సమర్థంగా కట్టడి చేయగలిగారు.

కొట్టలేదు.. గుంజీలు తీయించలేదు

జిల్లా ప్రజలు స్వీయ నిర్బంధం పాటించాలని, భౌతిక దూరం పాటించాలని అవగాహన కల్పించారే తప్ఫ. అక్కడి పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు ఎవరినీ కొట్టలేదు. లాఠీ ఎత్తలేదు. తప్పు చేశావంటూ గుంజీలు తీయించలేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేశారు. జనానికి అర్థమయ్యే భాషలో అవగాహన కల్పించారు. బయటకు రావద్దని విన్నవించారు. ఈ క్రతువు వెనుక ఎస్పీ సునీల్‌దత్‌ కృషి దాగుంది. వారికి నిత్యం సూచనలు, సలహాలు ఇస్తూ.. షిప్టుల వారీగా బాధ్యతలు అప్పగించారు. విధి నిర్వహణలో అలసట లేకుండా ఈ చర్య ఉపయోగపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటు చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రానికి, ఇటు ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దు ప్రాంతం. ఈ క్రమంలో సరిహద్దు ప్రాంతంలో పోలీస్‌లను మోహరింపజేసి పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.

ఏం చేశారు? ఎలా చేశారు?

* గ్రామం/మండలం/జిల్లా స్థాయి బృందాల ఏర్పాటు

* గ్రామ స్థాయిలో సర్పంచి-ఎంపీటీసీ సభ్యులు/వీఆర్‌వో/ఏఎన్‌ఎం/పోలీసు/వార్డు సభ్యులతో కలిసి బృందం

* మండల స్థాయిలో వైద్యాధికారి/ఎస్‌హెచ్‌వో/తహసీల్దార్‌/ఎంపీడీవో తదితరులు

* జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్‌/డీఎంఅండ్‌హెచ్‌వో/డీఆర్‌డీవో తదితరులు

* గ్రామం/మండల/జిల్లా స్థాయి బృందాల మధ్య సమన్వయం, కలెక్టర్‌ పర్యవేక్షణ

* ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ, స్వీయ నిర్బంధం పాటించాలని అవగాహన

* నిత్యావసరాలు ఇంటికే చేరేలా చర్యలు

* జిల్లా కేంద్రంలో డిస్ట్రిక్ట్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు. 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు

* నిత్యావసరాల వద్ద చేతులు కడుక్కోవడానికి నీళ్లు, సబ్బు/శానిటైజర్లు పెట్టేలా చర్యలు

* కలెక్టర్‌ నిత్యం తన అభిప్రాయం(వాయిస్‌) జిల్లా ప్రజలకు వెళ్లేలా చర్యలు. డీవీడీల రూపంలో ప్రచారం

* కొత్తగూడెం, అశ్వాపురం, భద్రాచలం, మణుగూరులో ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు

* క్వారంటైన్‌ చేసిన ఇళ్లలో బ్లీచింగ్‌ చేయించడం, హైపో క్లోరైట్‌ ద్రావణం పిచికారి చేసేలా చూడటం

* వైద్యం/మందుల సరఫరాకు వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేయడం, చరవాణి సంఖ్యలను కేటాయించడం

* 50 వేల వరకు మాస్కులు స్వయం సహాయక సంఘాలతో తయారు చేయించి పంపిణీ

* భద్రాద్రి కొత్తగూడెం ఆరు జిల్లాలకు సరిహద్దుల్లో ఉండటంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.