భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో ఇసుక రీచ్‌లను ప్రారంభించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పలు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. భద్రాచలంలోని ఐటీడీఏ రోడ్డులో, బూర్గంపాడు మండలంలోని నాగినేని ప్రోలు పంచాయతీ పరిధిలో గ్రామ సభలు పెట్టి ప్రజల అభిప్రాయాలు సేకరించారు. కార్యక్రమంలో ఆయా సొసైటీ సభ్యులు... ఇసుక రీచ్‌లను ప్రారంభించడం వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు.
గత కొంతకాలంగా భద్రాచలంలో ఇసుక లేకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా గిరిజన సొసైటీకి వచ్చే నగదును లెక్కల ప్రకారం కచ్చితంగా గ్రామ సభలో తెలపాలని గిరిజన నాయకులు కోరారు.
ఇదీ చూడండి: తక్కువ అప్పులు చేసిన రాష్ట్రం తెలంగాణ: సీఎం