రాష్ట్రంలో మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలపై ప్రభుత్వం, పోలీసులు, అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మత్తుకు బానిసయ్యే ఎలాంటి పదార్థాలను విక్రయించినాచర్యలు చేపడుతున్నారు. అయితే ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ యువకుడు దగ్గుమందుకు బానిసై(Drug addiction)... యజమానిపై దాడికి చేసి వీరంగం సృష్టించాడు. దీనిపై ఈటీవీ భారత్ కథనానికి స్పందన వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ చర్యలు చేపట్టారు. భద్రాచలంలోని అన్ని మందుల షాపులపై రైడ్స్ నిర్వహించారు.
మెడికల్ షాపుల్లో రైడ్స్
మెడికల్ షాపుల్లో నిర్వహించిన తనిఖీల్లో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కాలం గడిచిన మందులు అమ్ముతున్నారని... కొన్ని మందులు బిల్లులు లేకుండా విక్రయిస్తున్నారని అధికారులు గుర్తించారు. అందుకే ఓ మందుల దుకాణంపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. దగ్గు మందు తాగి... మత్తులో(Drug addiction) హల్చల్ చేసిన సాయి అనే యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో విచారణ చేసినట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ వెల్లడించారు.
యువకుడిపై విచారణ
ఆ యువకుడు చాలాకాలం నుంచి దగ్గు మందుకి బానిసయ్యాడని... వాటితోపాటు సిగరెట్, గంజాయి తాగుతూ ఉంటానని తెలిపినట్లు అధికారులు తెలిపారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని పేర్కొన్నారు. అందుకే ఏ దుకాణంలో దగ్గు మందు కొన్నాడో చెప్పలేకపోయాడని వెల్లడించారు. భద్రాచలంలోని అన్ని దుకాణాలపై మళ్లీ దాడులు నిర్వహిస్తామని చెప్పారు. ఏమైన లోపాలు ఉంటే తగిన చర్యలు తీసుకుని... లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఏం జరిగింది?
ఏదైనా సరే సమపాళ్లలో తీసుకుంటేనే ఒంటికి, సమాజానికి మంచిది. అలా కాదని.. కొంచెం తక్కువైనా, మితిమీరి పోయినా విషంలా మారి దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. భద్రాచలంలో మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన ఓ యువకుడు.. దగ్గుమందుకు(Addicted to cough medicine) బానిసై వీరంగం సృష్టించాడు. మెడికల్ షాప్ యజమాని దగ్గు మందు టానిక్ ఇవ్వలేదని దుకాణంపై దాడికి దిగాడు. మత్తులో ఉన్న యువకుడిని స్థానికులు, పోలీసులు పట్టుకుని(Addicted to cough medicine) స్టేషన్‌కు తరలించారు.
ఇలా బానిసై..
క్రమంగా అలవాటు పడిచాలా కాలం నుంచి డ్రగ్స్‌కు అలవాటు పడిన యువకుడు(Addicted to cough medicine) దగ్గు తగ్గడం కోసం మెడికల్ షాపులో విక్రయించే ఓ సిరప్ వాడటం మొదలుపెట్టాడు. మాదక ద్రవ్యాలు దొరక్కపోవడంతో మెల్లగా ఆ దగ్గు మందుకు బానిసయ్యాడు. ప్రతిరోజూ దుకాణానికి వెళ్లి.. సిరప్ కొనుక్కొని తాగి మత్తులో రోడ్లపై తిరుగుతూ ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో బ్రిడ్జి సెంటర్లోని ఒక మెడికల్ షాపు వద్దకు వెళ్లి దగ్గు మందు(Addicted to cough medicine) పేరు చెప్పి ఇవ్వమని అడిగాడు. దుకాణ యజమాని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తామని చెప్పాడు. దీంతో అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనంతరం వేరే దుకాణం నుంచి కాఫ్ సిరప్ తెచ్చుకొని తాగాడు. వెంటనే మొదటి షాపు వద్దకు వెళ్లాడు. ఆ దుకాణంలో ఇచ్చారు.. మీరెందుకు ఇవ్వరంటూ గొడవ చేశాడు. అనంతరం షాపుపై దాడికి దిగాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అతడికి సముదాయించినప్పటికీ ఆగకుండా ఆ కానిస్టేబుల్ ఎదుటే మెడికల్ దుకాణం(Addicted to cough medicine) పై రాళ్లు వేయడానికి ప్రయత్నించాడు. పోలీసు ఆపినా ఆగకుండా రోడ్డుపై హల్చల్ సృష్టించాడు. దీంతో బలవంతంగా ఆ యువకుడిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: Addicted to cough medicine: దగ్గు మందుకు బానిసై.. మత్తులో మెడికల్ షాప్ వద్దకు వెళ్లి..