Bhadradri Hundi Counting: భద్రాచలం రామయ్య సన్నిధిలో హుండీ లెక్కింపు కొనసాగుతోంది. గత 67 రోజులుగా స్వామివారికి హుండీలో భక్తులు వేసిన నగదును ఆలయ సిబ్బంది లెక్కిస్తున్నారు. ఉదయం హుండీలోని వెండి, బంగారం, నగదును తీసి... పోలీసు బందోబస్తు నడుమ చిత్రకూట మండపం వద్దకు తీసుకువెళ్లి లెక్కింపు ప్రారంభించారు.
అక్టోబరు 21న హుండీ ఆదాయం లెక్కించగా... అప్పటి నుంచి వచ్చిన ఆదాయం లెక్క తేలనుంది. ప్రధాన ఆలయంలోని హుండీలతో పాటు ఉపఆలయాల హుండీల నగదు లెక్కింపు సైతం నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: ఖమ్మంలో ఒమిక్రాన్.. అప్రమత్తమైన వైద్య సిబ్బంది..