ETV Bharat / state

స్పందించని ముఖ్యమంత్రి అవసరమా..?: బండి సంజయ్​ - భద్రాద్రి జిల్లా తాజా వార్తలు

తెలంగాణలో అనేక సమస్యలు ఎదురవుతోన్న స్పందించని సీఎం.. అవసరమా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రశ్నించారు. ప్రశాంతమైన భాగ్యనగరం కొవిడ్ నగరంగా మారిందని బండి సంజయ్​ చేశారు. జిల్లాస్థాయిలో ఒక తీరు.. రాష్ట్ర స్థాయిలో మరొక తీరు కరోనా కేసుల సంఖ్య చెబుతున్నారని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.

స్పందించని ముఖ్యమంత్రి అవసరమా..?: బండి సంజయ్​

author img

By

Published : Sep 3, 2020, 10:08 PM IST

స్పందించని ముఖ్యమంత్రి అవసరమా..?: బండి సంజయ్​

రాష్ట్రంలో అనేక సమస్యలు ఎదురవుతోన్న స్పందించని సీఎం.. అవసరమా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఇటీవల కొవిడ్ కారణంగా మరణించిన భాజపా ఇల్లందు నాయకుడు కుటుంబరావు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జిల్లాస్థాయిలో ఒక తీరు.. రాష్ట్ర స్థాయిలో మరొక తీరు కరోనా కేసుల సంఖ్య చెబుతున్నారని విమర్శించారు.

ప్రశాంతమైన భాగ్యనగరం కొవిడ్ నగరంగా మారిందని బండి సంజయ్​ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా చాలా మంది పేద ప్రజలు మరణించారని.. వైరస్​తో చనిపోయిన వారి అంత్యక్రియల కోసం రూ. 40 వేల దాకా ఖర్చు వస్తోందన్నారు. కొవిడ్ టెస్టుల సంఖ్య పెంచాలని మేధావులు, కేంద్రప్రభుత్వం, పలువురు సూచనలు చేసినా కేసీఆర్​ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పలువురు భాజపా నాయకులు కార్యకర్తలు సైతం కొవిడ్ కారణంగా మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన.. ఆయన కుటుంబం బాగానే ఉన్నామనుకుంటూ సీఎం కేసీఆర్​ ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని సంజయ్​ ఆరోపించారు. ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో.. కొండగట్టు ప్రమాదం జరిగినప్పుడు సీఎం స్పందించలేదన్నారు. శ్రీశైలం ఘటన నేపథ్యంలో కూడా తగు రీతిలో స్పందించలేదని, ఉద్యమ పార్టీగా ప్రజలు గెలిపిస్తే తెలంగాణ ద్రోహులను అన్ని వైపులా ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పలు సమస్యలు ఎదురవుతోన్న స్పందించని ముఖ్యమంత్రి అవసరమా అని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్​రెడ్డి పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.