ETV Bharat / state

కందకం పనులను అడ్డుకున్న జడ్పీ ఛైర్మన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అర్బన్ పార్క్ కోసం అటవీశాఖ చేపడుతోన్న కందకం పనులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య.. నిర్మాణ పనులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం.. పోడు సమస్యను పరిష్కరిస్తానని చెబుతున్నప్పటికీ అటవీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు.

trench works
trench works
author img

By

Published : May 5, 2021, 11:01 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని.. సుదిమల్ల, బాలాజీ నగర్, సుభాష్ నగర్ ప్రాంతాల్లో అర్బన్​ పార్క్ కోసం అటవీ శాఖ చేపడుతోన్న కందకం పనులను జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య అడ్డుకున్నారు. భూమినే నమ్ముకొని జీవిస్తోన్న గిరిజనులను ఇబ్బందులు పెట్టొద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. డీఎఫ్ఓ, స్థానిక ఫారెస్ట్ అధికారులతో ఫోన్ ద్వారా చర్చించారు.

సీఎం.. పోడు సమస్యను పరిష్కరిస్తానని చెబుతున్నప్పటికీ అటవీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కనకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు హాని చేసే ఏ పనినైనా అడ్డుకుంటామన్నారు.

ఇదీ చదవండి: రైల్వే సిబ్బందికి అదనపు పడకలు ఏర్పాటు చేయాలి: గజానన్​ మాల్యా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.