భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ఎస్బీఐ ఏటీఎంను దుండగులు ధ్వంసం చేసి చోరీకి యత్నించారు. రహదారిలో దగ్గర్లో ఉన్న ఏటీఎంను నిన్న రాత్రి ధ్వంసం చేశారు. పట్టణంలోనే గుర్రాల చెరువు రహదారిలో ఉన్న ఆంధ్రబ్యాంక్ ఏటీఎంలో కూడా చోరికి ప్రయత్నించారు . ఒకే ముఠా రెండు చోట్ల చోరికి ప్రయత్నించిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎంలపై వరుస చోరీ యత్నాలు జరుగుతుండటంతో ఏటీఎంల వద్ద భద్రత లేకపోవడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా బ్యాంక్ అధికారులు స్పందించి ఏటీఎంల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: కేటీఆర్ చొరవతో.. వలస కార్మికులకు విముక్తి