ETV Bharat / state

ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందడం లేదని యువకుడి సెల్ఫీ వీడియో

ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ చికిత్స సరిగా అందడం లేదని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ఫీ వీడియో తీసి సామాజిక ప్రసార మాధ్యమాల్లో పెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఈ సంఘటన జరిగింది.

A young person taken selfie video about covid treatment in bhadrachalam area hospital
ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ చికిత్సపై యువకుడి ఆవేదన
author img

By

Published : May 20, 2021, 7:33 PM IST

ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా బాధితులకు వైద్యం సరిగా అందడం లేదని ఒక యువకుడు సెల్ఫీ వీడియోను ప్రసార మాధ్యమాల ద్వారా బయటకు పంపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఈ సంఘటన జరిగింది. చికిత్స కోసం వచ్చిన బాధితులను ఎవరూ పట్టించుకోవడం లేదని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఒక్కరోజే ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనాతో చికిత్సపొందుతూ ఏడుగురు మృతి చెందారు.

ఆరోజు రాత్రంతా మృతదేహాలతో కలిసి ఉండాల్సి వచ్చిందని.. ఆస్పత్రిలోని పరిసరాలను శుభ్రంగా ఉంచడం లేదని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సులు, డాక్టర్లు కొవిడ్ రోగులను పట్టించుకోవడంలేదని యువకుడు వాపోయారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందుతుందని ప్రసార మాధ్యమాల్లో వచ్చే వార్తలను ప్రజలెవరూ నమ్మవద్దని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. భద్రాచలంలో 104 మంది ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతుండగా... బుధవారం ఏడుగురు, గురువారం ఉదయం మరో ఇద్దరు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి: మనోధైర్యమే అసలైన మందు : మంత్రి నిరంజన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.