భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు ప్రజాపోరు యాత్ర చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని... వాటి పరిష్కారానికి పోరుయాత్ర చేపట్టామని సీపీఐ నాయకుడు, కొత్తగూడెం మాజీ శాసనసభ్యుడు సాంబశివరావు తెలిపారు. పట్టణంలోని రాజుపేట కాలనీలో సీపీఐ జెండాను ఆవిష్కరించి ప్రజాపోరాట యాత్ర ప్రారంభించారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాడేందుకు.. యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజా పోరాట యాత్రలో వామపక్ష, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: చంద్రయాన్-2: రెండో సారి కక్ష్య తగ్గింపు విజయవంతం