ETV Bharat / state

రూ. 20 వేల కోసం కన్నబిడ్డనే అమ్మిన కసాయి తండ్రి - A FATHER SOLD 4 DAYS BABY FOR 20 THOUSAND RUPEES IN THIMMAPUR

ఆ దంపతులకు ఇప్పటికే ఐదుగురు సంతానం. ఆరో సంతానానికి జన్మనివ్వగా... ఆ నవజాత శిశువును తల్లి నుంచి దూరం చేశాడు కసాయి తండ్రి. పుట్టిన నాలుగోరోజునే... రూ. 20 వేలకు అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిమ్మాపురంలో జరిగింది.

A FATHER SOLD 4 DAYS BABY FOR 20 THOUSAND RUPEES IN THIMMAPUR
A FATHER SOLD 4 DAYS BABY FOR 20 THOUSAND RUPEES IN THIMMAPUR
author img

By

Published : Dec 10, 2019, 9:30 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఓట్లపల్లి సమీపంలోని తిమ్మాపురంలో దారుణం చోటుచేసుకుంది. నాలుగు రోజుల పసికందును కన్నతండ్రే అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడు. సింగరాజు, సునీత దంపతులు ఏడేళ్ల క్రితం చత్తీస్​గఢ్​ నుంచి అటవీశాఖ కార్పోరేషన్​లో వెదురు నరికేందుకు వచ్చి తిమ్మాపురానికి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఐదుగురు సంతానం కాగా... అందులో ముగ్గురు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

సునీత ఆరోసారి గర్భం దాల్చగా... ప్రసవం కోసం శుక్రవారం రాత్రి అశ్వారావుపేట సామాజిక ఆస్పత్రికి వెళ్లారు. ప్రసవం అనంతరం నాలుగు రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్​ అయ్యారు. ఆస్పత్రిలోనే పరిచయమైన వ్యక్తికి పిల్లలు లేరని తెలపగా... రూ. 20 వేలకు తన బిడ్డను విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నాడు సింగరాజు. రూ.15 వేలు తీసుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో సునీత దగ్గరి నుంచి శిశువును బలవంతంగా లాక్కొని డబ్బులు ఇచ్చిన వ్యక్తికి అప్పగించాడు. విషయం తెలుసుకున్న అంగన్వాడీ టీచర్​... పోలీసులకు సమాచారం ఇవ్వగా... శిశువును తల్లి ఒడికి చేర్చారు.

రూ. 20 వేల కోసం కన్నబిడ్డనే అమ్మిన కసాయి తండ్రి

ఇదీ చూడండి : ఓ దాత... మీ సహృదయతే మా విధిరాత!

Intro:TG_KMM_04_10_KANNA_BIDDANU_VIKRAINCHINA_THANDRI_AV_TS10088 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఓట్లపల్లి సమీపంలోని తిమ్మాపురంలో దారుణం చోటుచేసుకుంది నాలుగు రోజుల పసికందును కన్నతండ్రి కసాయి గా మరి 20 వేల రూపాయలకు విక్రయించిన ఘటన ఇది వివరాల్లోకి వెళితే సతీష్ గాడు రాష్ట్రం నుంచి సింగరాజు సునీత ఏడేళ్ల క్రితం అటవీశాఖ కార్పొరేషన్ లో వెదురు నరికేందుకు వచ్చి తిమ్మాపురం లో స్థిరపడ్డారు వీరికి ఐదుగురు సంతానం అందులో ముగ్గురు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సునీత ఆరో సారి గర్భం దాల్చారు ప్రసవం కోసం శుక్రవారం రాత్రి అశ్వరావుపేట సామాజిక ఆస్పత్రికి వెళ్లారు నాలుగు రోజుల తర్వాత సోమవారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు అయితే సునీత భర్త సింగరాజు కు ఆసుపత్రిలోనే పరిచయమైన వ్యక్తి తనకు పిల్లలు లేరని పెంచుకుంటాం తెలిపాడు దీంతో సింగరాజు 20 వేల రూపాయలకు తన బిడ్డను విక్రయించేందుకు బేరం కుదుర్చుకుని కాక అతను నుంచి 15 వేల రూపాయలు కూడా తీసుకున్నాడు సునీత ఇంటికి వెళ్లే క్రమంలో బయటకు రావడంతో ఆమె చేతిలో ఉన్న శిశువును బలవంతంగా లాక్కొని డబ్బులు ఇచ్చిన వ్యక్తికి అప్పగించాడు దీంతో కన్నతల్లి తట్టుకోలేక ఇంట్లోనే రోగ్ ఇస్తూ కూర్చుంది ఈ విషయాన్ని మంగళవారం తెలుసుకున్న గ్రామంలోని అంగన్వాడీ ఉపాధ్యాయుని తాటి సుజాత తమ అ సూపర్వైజర్ సౌజన్య సహకారంతో పోలీసులకు సమాచారం ఇచ్చి బిడ్డను తల్లి ఒడి చేర్చారు

Body:కన్నబిడ్డనే విక్రయించిన కసాయి తండ్రి

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.