భద్రాచలంలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్లో రూ. 40 లక్షల విలువ గల 270 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 11 మంది పురుషులు, ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. సీలేరు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు 8 మంది తీసుకువచ్చారు. ఐదుగురు మహారాష్ట్రకు చెందిన వ్యక్తులకు గంజాయిని అందించే ప్రయత్నం చేస్తున్న సమయంలో పోలీసులకు అనుమానం వచ్చి పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని సీలేరు నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్ తరలిస్తుండగా గంజాయి పట్టుకున్నట్లు సీఐ వినోద్ రెడ్డి తెలిపారు. నిందితులను అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి : 40 ప్రేమ కథల 'కడలి'