కరోనా నేపథ్యంలో ఏ రంగు చల్లితే ఏమవుతుందో అనే భయంతో యవతులు సహజ రంగులపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ శివారులో ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న మోదుగు పూలను కొంత మంది యువతులు తీసుకొచ్చి హోలీ కోసం ప్రత్యేకంగా రంగు తయారు చేశారు.
హోలీ పండగ కంటే రెండు రోజుల ముందుగానే ఆ పూలను తీసుకొచ్చి నీటిలో నిల్వ ఉంచుతున్నారు. ఆ తర్వాత వాటిని మరిగించి, దంచారు.
ఇలా సహజసిద్ధమైన రంగులను తయారు చేశారు. ఈ పద్ధతి పలు గిరిజన ప్రాంతాల్లో ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తున్నాయని వారు తెలిపారు.
రసాయనాలతో కూడిన రంగులు వాడటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో వీటికి దూరంగా సహజ రంగులను వాడుతున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:హోలీ ఆడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!