దేశవ్యాప్తంగా నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్స్ (జేఈఈ)లో ఆదిలాబాద్ విద్యార్థి అద్భుత ప్రతిభ కనబర్చారు. జాతీయ స్థాయిలో 100 పర్సంటైల్‌తో 18 ర్యాంకు సాధించాడు. తెలంగాణ నుంచి రాణించిన ఎనిమిది మంది విద్యార్థుల్లో ఆదిలాబాద్‌కు చెందిన దీటి యశశ్చంద్ర ఒకరు.
అమ్మనాన్నలిద్దరూ ఉపాధ్యాయులే ..
తల్లిదండ్రులు నిరోజన-మురళీ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంటర్ పూర్తిచేసిన యశశ్చంద్ర... ఈనెల 6న కరీంనగర్‌లో జేఈఈ మెయిన్స్ అర్హత పరీక్ష రాశాడు.
18వ ర్యాంకు..
శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఫలితాల్లో 18 ర్యాంకు సాధించి.. ఆదిలాబాద్ అక్షర కిరణంలా నిలిచాడు. ఈనెల 27న హైదరాబాద్‌లో జరిగే అడ్వాన్స్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ముంబయి ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యమని.. యశశ్చంద్ర తెలిపాడు. కుమారుడు సాధించిన విజయంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : సోమవారం తెలుగు రాష్ట్రాల రవాణాశాఖ అధికారుల భేటీ