ETV Bharat / state

పూజలో తప్పిదం.. 18 కుటుంబాలు వెలి

ఆదివాసీల సంస్కృతీ సాంప్రదాయాలు కొంచెం భిన్నంగా ఉంటాయి.. అవే వారికి అందం, అలంకారమూ. కానీ పూజ చేసే విధానంలో పొరపాటు జరిగిందని ఊరి నుంచి ఒక కుటుంబాన్నే వెలివేశారంటే ఎంతటి అజ్ఞానంలో వారు ఉన్నారో ఒక్కసారి ఆలోచించాల్సిందే.. ఆ కుటుంబానికి అండగా మరో 18 కుటుంబాలూ ఊరిని వదిలాయాయి.. ఇంతకీ ఆ పూజ ఏంటీ ఆ కథేంటీ అనుకుంటున్నారా.. ఐతే ఆదిలాబాద్​ జిల్లాకి వెళ్లాల్సిందే..

author img

By

Published : Feb 12, 2020, 3:12 PM IST

tribal-family-expatriation-in-a-village-at-adilabad
పూజలో తప్పిదం.. 18 కుటుంబాలు వెలి

ఆదిలాబాద్​ జిల్లా ఆదివాసీలకు సాంస్కృతికి పెట్టింది పేరు. వారీ జీవనశైలీ.. ఆచార వ్యవహారాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆధునిక నాగరికతకు వారు చాలా భిన్నం. కానీ వారు ప్రేమలకు ఆదివాసీ జీవనానికి పట్టుకొమ్మలు. అయితే ఒక్కోసారి వారి అమాయకత్వమో.. మూఢనమ్మకమో తెలియదు కానీ.. పదిరోజుల క్రితం వారి ఆరాధ్యదైవమైన భీమ్​దేవుడు జంగుమాతకు చేసే పూజా కార్యక్రమాల్లో ఏదో తప్పిందం జరిగిందంటూ ఉట్వూరు మండలం రామ్​గూడలోని కారోబార్​ రామ్​చందర్​ ఇంటిని కూల్చివేసి వారిని వెలివేశారు.

పూజలో తప్పిదం.. 18 కుటుంబాలు వెలి

తాము ఎప్పుడూ ఇలానే చేస్తామని ఆచారవ్యవహారాల్లో ఎటువంటి తప్పిదం చేయలేదంటూ గ్రామ పెద్దలకు ఊరి ప్రజలకు రామ్​ చందర్​ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. రామ్​చందర్​ కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడినా లాభం లేకుండా పోయింది.​ అపచారం జరిగిందని ఊరిని వదిలివెల్లాల్సిందేనని ఆదేశించారు. దానితో దిక్కు తోచని స్థితిలో అతను కుటుంబ సభ్యులతో సహా సమీపంలోని ఏందా గిరిజన గ్రామంలోని వ్యవసాయ భూముల్లో చిన్న గుడిసె వేసుకుని ఆశ్రయం పొందుతున్నాడు.

రామ్​గూడలోని మరో 18 కుటుంబాలు రామ్​చందర్​కు మద్దతుగా నిలిచాయి. అతనితో పాటు వారు ఆ ఊరిని విడిచి వచ్చేశారు. రామ్​గూడ గ్రామంలో ఉండేదే 85 కుటుంబాలైతే వారిలో ఇరవై కుటుంబాలు ఇప్పుడు ఆ ఊరిని విడిచేలా చేసింది వారి మూఢనమ్మకం.

ఇదీ చూడండి: ఆ వరస హత్యలు చేసింది సైకో కిల్లరా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.