ETV Bharat / state

'జీవో నం.3 యథావిధిగా అమలు చేయాలి'

జీవో నం.3ని సుప్రీంకోర్టు రద్దు చేయడం వల్ల వేలాది మంది గిరిజనులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని ఆదివాసీ విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవోను ప్రభుత్వం యథావిధిగా అమలు చేయాలని కోరారు. అలాగే పోడుభూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

The leaders of the Tundendeba Adivasi Student Unions held a strike in front of the Utnaur ITDA office
జీవో నం.3 యథావిధిగా అమలు చేయాలి
author img

By

Published : Jul 6, 2020, 5:55 PM IST

ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​ ఐటీడీఏ కార్యాలయం ముందు తుడుందెబ్బ ఆదివాసీ విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలు పలు సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

జీవో నంబర్ 3 యథావిధిగా అమలుచేయాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రభుత్వ వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఆదివాసీలు సాగుచేసుకుంటున్న అటవీ భూములకు పట్టాపుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిచో జిల్లా కలెక్టర్ కార్యాలయం, సీఎం ఫామ్ హౌస్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ పీఓ భవిష్ మిశ్రాకు అందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.