ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన నాయకపోడులు వారి కుల దైవమైన భీమన్న దేవునితో కాలినడకన గోదావరికి శుక్రవారం పయనమయ్యారు. ఉట్నూర్ మండలం షాంపూర్ పంచాయతీ పరిధిలోని రాజన్నగూడెం నాయకపోడులు భక్తిశ్రద్ధలతో సామూహికంగా భీమన్న దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ తరలివెళ్లారు.
తప్పెట్ల చప్పుళ్లతో వీధుల్లో ఊరేగింపు చేశారు. భక్తులు కట్నకానుకలు సమర్పించుకున్నారు. అనంతరం చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా కాలినడకతో రాజన్నగూడెం నుంచి జన్నారం మండలం గోదావరికి వెళ్లారు. ఆదివారం గోదావరి నదిలో ప్రత్యేక పూజలు చేసి, సోమవారం మొక్కులు తీర్చుకుంటామని గ్రామ పెద్దలు అన్నారు.
ఇదీ చూడండి : ఉర్రూతలూగించిన గీతం స్టూడెంట్ ఫెస్ట్