ETV Bharat / state

పర్యవేక్షణ మరిచిన తూనికలు కొలతల విభాగం.. నష్టపోతున్న రైతులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారత పత్తి సంస్థ (సీసీఐ) ఈసారి 16 మార్కెట్‌ యార్డుల్లో 24 కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు చేస్తోంది. మార్కెట్‌ యార్డుల పరిధిలోని కాంటాల నిర్వహణను మార్కెట్‌ కమిటీలు, ప్రైవేటు కాంటాల నిర్వహణను వాటి యజమానులు చూసుకోవాలి. ఈ క్రమంలో లోపాలు తలెత్తకుండా తూనికలు కొలతల విభాగం నిరంతరం పర్యవేక్షణ చేయాలి. క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Telangana Weights and Measures Department failed to monitor twings
పర్యవేక్షణ మరచిన తూనికలు కొలతల విభాగం
author img

By

Published : Nov 10, 2020, 1:59 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా వ్యాప్తంగా.. 24 కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు చేస్తోంది. నిబంధనల ప్రకారం మార్కెట్‌ యార్డుల ఆదాయంతో పాటు కాంటాలను పరిగణనలోకి తీసుకొని ఏడాది పాటు వాటి నిర్వహణకు మార్కెటింగ్‌ శాఖ ఇప్పటికే టెండరు పూర్తిచేసింది. దీనికోసం ప్రత్యేకంగా రూ.లక్షల్లో బడ్జెట్‌ సైతం కేటాయిస్తోంది. కాంటాల నిర్వహణలో లోపాలపై ఆదిలాబాద్‌ జిల్లా తూనికలు కొలతలశాఖ అధికారి జలీల్‌ను చరవాణిలో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 18 మార్కెట్‌ యార్డుల్లో ఉన్న కాంటాల నిర్వహణ బాధ్యత ఆయా మార్కెట్‌ కమిటీలే పర్యవేక్షించాల్సి ఉంది. వీటి నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా టెండరు నిర్వహిస్తుంది. దీని కోసం ప్రత్యేక బడ్జెట్‌ సైతం కేటాయిస్తారు. ఏడాది పాటు కాంటాల నిర్వహణను పనులు దక్కించుకున్న గుత్తేదారు ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంది.

మొదటి రోజే తేడా..

దిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో అక్టోబరు 29 నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. అదేరోజు భీంపూర్‌ మండలం నిపానికి చెందిన దత్తు అనే రైతు ఓ వాహనంలో తెచ్చిన పత్తి ఆరో నెంబరు కాంటా వద్ద తూకం వేయగా.. 35.80 క్వింటాళ్ల బరువు వచ్చింది. అనంతరం సీసీఐ కొనుగోలు కేంద్రంలో తూకం వేయగా.. 39.90 క్వింటాళ్లు వచ్చింది. అంటే నాలుగు క్వింటాళ్ల పది కిలోల తేడా వచ్చింది. సీసీఐ అధికారులు చెప్పడంతో అప్రమత్తమైన రైతు తిరిగి మార్కెట్‌ యార్డుకు వచ్చి ఆరా తీయగా కాంటాలో లోపం తలెత్తినట్లు తేలింది. నాలుగు క్వింటాళ్ల బరువు తగ్గినట్లు అధికారులు గుర్తించడంతో రైతుకు విషయం తెలిసింది. ఒకవేళ 50 కిలోలు, క్వింటాలు తేడా వచ్చి ఉంటే విషయం బయటకు తెలిసేది కాదు.

సోయాలో 10 క్వింటాళ్లు మాయం

టీవల ఓ ప్రైవేటు కాంటా దగ్గర ట్రాక్టరు నిండా సోయా విత్తనాలతో వచ్చిన వాహనాన్ని తూకం వేయగా.. 43 క్వింటాళ్ల బరువు తూగింది. సరకును దించాక ఖాళీ ట్రాక్టరును తూకం వేయగా 35 క్వింటాళ్ల బరువు వచ్చింది. దీంతో సరకు మొత్తం 8 క్వింటాళ్లే అని తేల్చారు. ఈ క్రమంలో జిన్నింగ్‌ మిల్లు సిబ్బంది కేవలం ఎనిమిది క్వింటాళ్లను ట్రాక్టర్‌లో వేసి తీసుకొస్తావా..? అరడంతో రైతు కంగుతిన్నారు. అప్పటికే సరకంతా అన్‌లోడ్‌ చేయడంతో ఏం చేయలేమని సిబ్బంది చేతులెత్తేశారు. ట్రాక్టర్‌లో తెచ్చినంత సరకును మళ్లీ నింపి తిరిగి తూకం వేశాక బరువు నిర్ధారణ చేయాలని సదరు రైతు పట్టుబట్టారు. నిజంగానే నష్టం జరిగిందని గ్రహించిన వ్యాపారి 18 క్వింటాళ్లుగా నిర్ధారించి రైతుకు డబ్బులు చెల్లించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.