ఆదిలాబాద్ పట్టణంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. 11 రోజుల సమ్మెలో భాగంగా ఎన్టీఆర్ కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. వీరి ఆందోళనకు ఉపాధ్యాయ సంఘాలతో పాటు అంగన్వాడీలు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. సుందరయ్య భవన్ నుంచి కలెక్టరేట్ మీదుగా తెలంగాణ తల్లి చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చూడండి: సమ్మెలో కార్మికలోకం... సర్కారు చర్చల సంకేతం!