ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని భీంపూర్, తాంసి మండలాల్లో ప్రాదేశిక ఎన్నికలపై ఎండ ప్రభావం కనిపించింది. ఉదయం సమయంలో ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు.. మధ్యాహ్నం వేళలో రాలేదు. పోలింగ్ కేంద్రాలు వెల వెల బోయాయి. ఒంటి గంటకు వరకు తాంసి మండలంలో 56.57శాతం, భీంపూర్ మండలంలో 55.65శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. మధ్యాహ్నం రెండు గంటల వ్యవధిలో కేవలం 5 శాతం పోలింగ్ జరగడం చూస్తుంటే ఎండ ప్రభావం ఏమేరకు ఉందో స్పష్టమవుతోంది.
ఇవీ చూడండి: ఓటు హక్కు వినియోగించుకున్న ఈనాడు ఎండీ కిరణ్