ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. మొన్నటి వరకు కరోనా భయంతో బయటకు రావడానికి భయపడిన జనం.. ఇప్పుడు ఎండల వేడికి బయటకు రావాలంటే భయపడుతున్నారు. రెండు రోజుల క్రితం 41.3 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 44 డిగ్రీలకు పెరిగింది.
ఆదిలాబాద్ సహా.. ఉట్నూరు, బోథ్, ఇచ్చోడ కేంద్రాల్లో జన సంచారమే లేదు. ఎండలతో పాటు.. వేడిగాలులు వీస్తూ.. జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
ఇదీ చూడండి: పెళ్లికొచ్చిన బంధువులు నెల రోజులుగా టెంట్ల కిందే!