ఆదివాసుల జోలికొస్తే ఊరుకునేది లేదని ఎంపీ సోయం బాపురావు అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో ఆలీ గుడాలు నిర్వహించిన దండారి సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. గిరిజన ప్రజలు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి దండారి నృత్యం చేశారుఆదివాసీలు సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగు చేస్తున్న భూమిలోకి ఎవరైనా వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దండారి సంబురాలకు ప్రతి గ్రామానికి 10 వేల చొప్పున నిధులు మంజూరు చేయాలని కోరారు. రాబోయే దండారి ఉత్సవాలను జిల్లా కేంద్రంలో నిర్వహిస్తామని ఆ కార్యక్రమానికి కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రపతిని ఆహ్వానిస్తామని సోయం బాపురావు తెలిపారు. డిసెంబర్లో చలో దిల్లీ కార్యక్రమంలో ఆదివాసులు అందరూ పాల్గొనాలని కోరారు.
ఇవీ చూడండి: బంపర్ ఆఫర్: పాత బంగారానికి... కొత్త ఆభరణాలు