ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఎమ్మెల్యే జోగు రామన్న లాంఛనంగా ప్రారంభించారు. ఉమ్మడి పది జిల్లాల నుంచి అండర్-17 విభాగ బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. తొలుత మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. మూడు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో రాష్ట్రస్థాయి జట్టును ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు నన్నపు స్వామి వెల్లడించారు.
ఇవీచూడండి: పవన్ పారితోషికం 100 కోట్లా..!