ETV Bharat / state

అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యం: కలెక్టర్

ఆదిలాబాద్‌ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్‌ జాతీయ జండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Republic Day celebrations held in Adilabad district
ఆదిలాబాద్​లో ఘనంగా గణతంత్ర వేడుకలు
author img

By

Published : Jan 26, 2021, 10:22 PM IST

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని పరేడ్‌ మైదానంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.​ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ సమక్షంలో పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.

పాలనాధికారి సిక్తా పట్నాయక్‌ జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును వివరించారు. వ్యవసాయ పెట్టుబడి సాయంలో భాగంగా ఖరీఫ్‌ రూ. 264. 03 కోట్లు, యాసంగిలో మరో రూ. 239.85 కోట్లు రైతు బంధు సాయం చేసినట్లు వెల్లడించారు.

జిల్లా సమగ్రాభివృద్ధికి అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. అనంతరం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు.

ఇదీ చదవండి: ముగిసిన రైతుల ర్యాలీ- కిసాన్ మోర్చా ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.