ETV Bharat / state

Pregnant Died: సకాలంలో వైద్యం అందక నిండు గర్భిణి మృతి - Pregnant lady Died

ఆ గ్రామానికి సరైన రోడ్డు లేకపోవటం... అతికష్టం మీద ఆస్పత్రికి చేరినా అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవటం... ఏమాత్రం ఆలస్యం చేయకుండా అటు నుంచి ఇంకో ఆస్పత్రికి తరలించినా చికిత్స చేయకుండా.. పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించటం.. వీటన్నింటి వల్ల ఓ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది.

Pregnant lady Died with late treatment in parsuwada in adilabad district

author img

By

Published : Aug 23, 2021, 4:53 AM IST

సకాలంలో వైద్యం అందక నిండు గర్భిణి మృతి

ఆదిలాబాద్‌ జిల్లా గాదిగూడ మండలంలో విషాదం చోటుచేసుకుంది. సకాలంలో వైద్యం అందక ఓ నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. పర్సువాడలో రాజుబాయి అనే మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. సరైన రోడ్డు మార్గం లేక వాహనాలేవీ.. గ్రామంలోకి రాలేకపోయాయి. చేసేదేమీ లేక... గర్భిణీని చేతులపైనే సమీపంలోని వాగు దాటించారు.

వాగు వరకు వచ్చిన అంబులెన్సులో ఎక్కించి... చికిత్స కోసం తరలించారు. సమీపంలోని గాదిగూడ పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న సమయానికి ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేరు. వెంటనే అక్కడి నుంచి ఝరి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడం వల్ల వైద్యులు ఆదిలాబాద్‌ రిమ్స్‌కు వెళ్లమని సూచించారు. రిమ్స్‌కు తరలిస్తుండగా.... మార్గం మధ్యలోనే గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది.

ఇదీ చూడండి:

suicide: అన్న రాఖీ కట్టించుకోలేదని సోదరి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.