ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ విద్యామందిర్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యాసంస్థలకు శనివారం నుంచి దసరా సెలవులు ఉన్నందున ముందుగానే బతుకమ్మ సంబురాలు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా యాజమాన్యం విద్యార్థులు, వారి కుటుంబీకులతో బతుకమ్మ వేడుకలను నిర్వహించింది. ఈ సంబురాల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని బంతిపూలతో బంగారు బతకమ్మలను పేర్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలతో పాటు విద్యార్థులు బతకమ్మ ఆటలాడారు. కోలాటాలు వేశారు.
ఇవీ చూడండి: దేశంలో మళ్లీ ఉల్లి కష్టాలు... బాధ్యులు ఎవరు...?