ETV Bharat / state

పనులు శరవేగం... పరిహారం మాత్రం ఆలస్యం... - పిప్పళ్ల కోట భూ నిర్వాసితుల ఆందోళన

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెన్​గంగా నది నీటిని ఒడిసి పట్టి  ఆదిలాబాద్​లోని పంటపొలాలను సారవంతం చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. శరవేగంగా పిప్పల కోట బ్యారేజీ నిర్మించడానికి రైతుల నుంచి భూ సేకరణ చేశారు. పనులు మొదలై ఏడాది గడుస్తున్నా.. మాకు పరిహారం ఇవ్వలేదంటూ భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

pipplakota barrage  land victims protest at adilabad
పనులు శరవేగం... పరిహారం మాత్రం ఆలస్యం...
author img

By

Published : Dec 22, 2019, 7:43 AM IST

పనులు శరవేగం... పరిహారం మాత్రం ఆలస్యం...

తెలంగాణ-మహారాష్ట్ర నుంచి ప్రవహిస్తోన్న పెన్​గంగా నీటిని ఒడిసి పట్టి ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని పంట చేలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పిప్పలకోటి గ్రామ శివారులో మరో జలాశయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 368 కోట్ల నిధులను మంజూరు చేసింది. చనకా కోరాట బ్యారేజికి అనుసంధానంగా హత్తిఘాట్ వద్ద పంపు హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి పిప్పలకోటి జలాశయానికి నీటిని మళ్లించాలని నిర్ణయించారు. ఈమేరకు 1024.10 ఎకరాలు అవసరమని భావించి మేరకు అధికారులు భూ సేకరణ పూర్తి చేశారు. మెజార్టీ రైతులకు ప్రయోజనం కలుగుతుందనే భావనతో నిర్వాసితులకు అధికారులు ఎకరానికి 8 లక్షలు ఇస్తామంటే ఒప్పుకుని అన్నదాతలు భూములు అప్పగించారు.

పరిహారం ఇవ్వండి..

బ్యారేజీ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఏడాది కిందట అప్పగించిన భూములకు ఇప్పటికీ పరిహారం రాకపోవడంతో నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పరిహారం ఇవ్వకుంటే పనులు అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నారు.

పరిహారం ఇప్పించడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం చేస్తున్నారని భాజాపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ విమర్శించారు. బాధిత రైతులతో కలిసి బ్యారేజి స్థలాన్ని ఆయన సందర్శించారు.

ఇస్తాం కంగారు పడొద్దు..

ఇదిలా ఉంటే రైతులు ఆందోళన చెందవద్దని వారికి చెల్లించాల్సిన 81 కోట్ల రూపాయలను త్వరలో బాధిత రైతుల ఖాతాల్లో జమ చేస్తామంటున్నారు అధికారులు.

వీలైనంత త్వరగా తమకు న్యాయం చేయాలని భూ నిర్వాసితులు వేడుకుంటున్నారు. లేకుంటే ఆందోళన బాట పడుతామంటున్నారు.

ఇదీ చూడండి: శిశువు మరణంపై కలెక్టర్​ విచారణ... ఇద్దరు వైద్యుల సస్పెండ్​

Intro:TG_ADB_05_21_PIPALKOTI_BARAGE_PKG_TS10029
TG_ADB_05A_21_PIPALKOTI_BARAGE_PKG_TS10029
TG_ADB_05B_21_PIPALKOTI_BARAGE_PKG_TS10029
ఎ. అశోక్ కుమార్, ఆదిలాబాద్,8008573587
--------------------------------------------------------------------
(): రెండు నియోజకవర్గాల ప్రజలు సాగు తాగునీటి కల్పనకు నిర్మించతలపెట్టిన జలాశయం అది.. భూసేకరణ పూర్తి అయి నిర్వాసితులు భూములు అప్పగించారు. పనులు మొదలయ్యాయి. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ప్రవహిస్తున్న పెను గంగా నదిపై గా నిర్మిస్తున్న చనకా కోరటా జలాశయానికి అనుసంధానంగా నిర్మిస్తున్న పిప్పలకోటి బ్యారేజీ నిర్వాసితులు ఏడాదిగా పరిహారం రాక ఆందోళన చెందుతున్నారు......look

Body:(): తెలంగాణ మహారాష్ట్ర నుంచి ప్రవహిస్తున్న పెన్గంగా నీటిని ఒడిసి పట్టి ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని పంట చేల సాగునీరు అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పిప్పలకోటి గ్రామ శివారులో మరో జలాశయంనిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 368 కోట్ల నిధులను మంజూరు చేసింది.చనకా కోరాట బ్యారేజికి అనుసంధానంగా హత్తిఘాట్ వద్ద పంపు హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి పిప్పలకోటి జలాశయానికి నీటిని మళ్లించాలని నిర్ణయించారు. ఈమేరకు 1024.10 ఎకరాలు అవసరమని భావించి మేరకు అధికారులు భూ సేకరణ పూర్తి చేశారు మెజార్టీ రైతులకు ప్రయోజనం కలుగుతుందనే భావనతో నిర్వాసితులు అధికారులు ఎకరానికి 8 లక్షలు ఇస్తామంటే ఒప్పుకొని భూములు అప్పగించారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి ఇంతవరకు బాగానే ఉన్నా ఏడాది కిందట అప్పగించిన భూములకు ఇప్పటికీ పరిహారం రాకపోవడంతో నిర్వాసితుల ఆందోళన వ్యక్తమవుతోంది పరిహారం వెంటనే చెల్లించాలని కోరుతున్నారు గత్యంతరం లేక పోతే పనులు అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నారు.......
..........vsss bytes
బైట్1: షేక్ ఖాసిం భూ నిర్వాసితుడు
బైట్2: గడ్డం లక్ష్మన్న మండల ఉపాధ్యక్షులు
vo2: ఇదిలా ఉంటే రైతులు ఆందోళన చెందవద్దని వారికి చెల్లించాల్సిన 81 కోట్ల రూపాయలను త్వరలో బాధిత రైతుల ఖాతాల్లో జమ చేస్తామంటున్నారు అధికారులు...
.......byte
బైట్3: సూర్యనారాయణ ఆర్డిఓ అదిలాబాద్
VO3: ఇదిలావుండగా పిప్పలకోటి బ్యారేజి నిర్వాసితులకు పరిహారం ఇప్పించడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం చేస్తున్నారని భాజాపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ విమర్శించారు. బ్యారేజి స్థలాన్ని ఆయన బాధిత రైతులతో కలిసి సందర్శించారు తెలుసుకున్నారు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు........vsss byte
బైట్4: పాయల్ శంకర్ భాజపా జిల్లా అధ్యక్షులు ఆదిలాబాద్

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.