ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు.
అనంతరం పాలనాధికారికి వినతి పత్రం అందజేశారు. పాఠశాలలు పునః ప్రారంభం అయినందున తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విన్నవించారు.