తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రవహించే పెన్గంగనది... జలకళను సంతరించుకుంది. వారం, పది రోజుల కిందట... నీటి జాడలేక బోసి పోయిన గంగమ్మ ఇప్పుడు... వరద నీటితో పరవళ్లు తొక్కుతొంది. సందర్శకులతో పాటు నదీ పరివాహక ప్రాంత రైతుల్లో ఆనందం నింపుతోంది. రెండురోజులుగా విస్తారంగా వర్షాలు కురవటం వల్ల రెండు రాష్ట్రాలను అనుసంధానం...చేసే సరిహద్దు గ్రామమైన డొలార వంతెన వద్ద ప్రత్యేక పూజలు చేశారు. శివపార్వతులకు మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవీచూడండి: జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు