ఆదిలాబాద్లో పండరిపురం యాత్ర వైభవంగా సాగింది. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని పండరిపురం.. బయలుదేరిన విఠల-రుక్మాంభాయి భక్తుల యాత్ర దుర్గామందిరం వరకు జరిగింది. హిందువుల సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకునే ఈ వేడుకలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ వరకు సాగిన పాదయాత్రలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీఛైర్మన్ జనార్దన్ రాఠోడ్ పాల్గొని పల్లకి మోశారు. భక్తులంతా తన్మయత్వంతో నృత్యాలు చేస్తూ ముందుకుసాగారు.
ఇదీ చూడండి: మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష