హైదరాబాద్‌కు చెందిన ఫోర్‌స్కేర్ టెక్నో మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెట్ సంస్థ ఆదిలాబాద్ జిల్లాలో 596 మందికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికింది. వారి నుంచి రూ.3.57కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకూ ఉద్యోగాలు రాకపోవటం వల్ల అభ్యర్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 12 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ విష్ణు వెల్లడించారు. తమకు న్యాయం చేయాలని బాధిత యువకులు వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి: కలెక్టర్‌ను కలిసిన హాజీపూర్ బాధిత కుటుంబాలు