ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ దివ్య దేవరాజన్ సమక్షంలో మద్యం దుకాణాల లైసెన్సుదారుల ఎంపిక జరిగింది. ఎంపిక ప్రక్రియలో తారాబాయి అనే వృద్ధురాలు పాల్గొనడం ఆసక్తిని రేకెత్తించింది. సదరు వృద్ధురాలు పేరిట.. ఆమె మనవడు తమ గ్రామంలోని 12వ నెంబర్ మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత మద్యం దుకాణానికి 16 మంది పోటీపడగా అందులో మహిళగా వృద్ధురాలు ఒక్కరే ఉండటం విశేషం. డ్రాలో దుకాణం వేరొకరికి దక్కడం వల్ల మనవడితో కలిసి వెనుదిరిగారు.
ఇవీ చూడండి : చరిత్రే చిన్నబోతోంది... ఆ రణభూమికి ఇప్పుడేమైంది!?