ETV Bharat / state

కరోనా ప్రభావం: చికిత్స కోసం వస్తే... కుదరదు పొమ్మన్నారు - ఆదిలాబాద్ జిల్లా వార్తలు

కూలి చేసుకుంటూ కాలం వెల్లదీసే ఓ వృద్ధునికి కిడ్నీ సమస్య శాపమైంది. ఏడాది కింద కిడ్నీలు పాడై మంచానికి పరిమితమయ్యారు. కరోనా కారణంగా ఆస్పత్రుల్లో డయాలసిస్​ సేవలు నిలిపివేశారు. చేసేది లేక మహారాష్ట్రలోని చంద్రాపూర్​ నుంచి ఆదిలాబాద్​కు​ వచ్చారు. తీరా చూస్తే ఇక్కడ కుదరదు పొమ్మన్నారు. చికిత్స కోసం ఎన్నో ఆశలతో వచ్చిన ఆ వృద్ధ దంపతులకు నిరాశే మిగిలింది.

old couple came from maharashtra to adilabad for treatment
కరోనా ప్రభావం: చికిత్స కోసం వస్తే... కుదరదు పొమ్మన్నారు
author img

By

Published : Dec 2, 2020, 12:59 PM IST

భర్తకు డయాలసిస్​ చేయించాలని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్​కు వచ్చారు ఓ వృద్ధ మహిళ. రెండు కిడ్నీలు పాడైన భర్తను తీసుకొని రిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఎన్నో అవస్థలు పడి ఆస్పత్రికి వచ్చిన ఆ వృద్ధ దంపతులకు నిరాశే మిగిలింది. కుమురం భీమ్ జిల్లా సరిహద్దులోని మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా జివిటి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు గైక్వాడ్ మహాదేవ్, అంబుజా బాయి కూలి పనులు చేసుకునే జీవనం సాగించేవారు. ఏడాది కింద మహాదేవ్ రెండు కిడ్నీలు పాడై మంచానికి పరిమితమయ్యారు. ఉచిత డయాలసిస్ కోసం వారంలో రెండుసార్లు చంద్రపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేవారు. కరోనా కారణంగా, ఆస్పత్రి విస్తరణ పనులతో కొన్ని నెలలు అక్కడ డయాలసిస్ సేవలు నిలిచిపోయాయి.

ప్రైవేటు ఆస్పత్రిలో డయాలసిస్ చేయించి అప్పుల భారంతో ఆదిలాబాద్ రిమ్స్​లో చేరారు. ఆధార్ కార్డు చూసిన సిబ్బంది తీరా డయాలసిస్ చేయడం కుదరదని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. ఆస్పత్రుల్లో ఉచిత డయాలసిస్ సేవలు అందుబాటులో ఉన్నా... కరోనా దృష్ట్యా ఆ సేవలను నిలిపేయడం కిడ్నీ బాధితులకు అవస్ధలు తెచ్చి పెడుతోంది.

ఇదీ చదవండి: వంట గ్యాస్​ మంట-​ భారీగా పెరిగిన ధర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.