జిల్లాల వారీగా జనాభా ప్రాతిపదికన చేసిన జడ్పీటీసీ రిజర్వేషన్లలో ఆదిలాబాద్ జిల్లాలోని 17 మండలాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి ఒకటి, ఎస్టీ సామాజిక వర్గానికి 7 స్థానాలు దక్కగా... మిగిలినవన్నీ జనరల్ స్థానాలుగా గుర్తించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 15 మండలాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి రెండు, ఎస్టీ సామాజికవర్గానికి అయిదు స్థానాలు దక్కగా మిగిలిన ఎనిమిది స్థానాలు జనరల్‌గా గుర్తించారు. ఈ రెండు జిల్లాల్లోజడ్పీటీసీ రిజర్వేషన్లల్లో బీసీలకు చోటు దక్కలేదు. రిజర్వేషన్లలో 50 శాతానికి మించరాదనే ఆదేశాలకు అనుగుణంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలతోనే సరిపోయిందనేది అధికారుల వివరణ.
రాష్ట్రస్థాయి జనాభా ప్రాతిపదికన ఎంపీపీల రిజర్వేషన్లు కేటాయించగా... ఆదిలాబాద్ జిల్లాలో రెండు, ఆసిఫాబాద్ జిల్లాలో రెండు స్థానాలే బీసీలకు దక్కాయి.
ఇవీ చూడండి:15 నుంచి ఒక్కపూట బడి