ETV Bharat / state

గాయత్రి జలపాతంలో సాహస క్రీడలు - ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గాయత్రి జలపాతంలో సాహస క్రీడలు

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గాయత్రి జలపాతంలో సాహస క్రీడలు అద్భుతంగా జరిగాయి. తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రంగారావు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ క్రీడాపోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 20 మంది సాహస క్రీడాకారులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి క్రీడలు.. నదిలో రాఫ్టింగ్‌
author img

By

Published : Oct 14, 2019, 11:03 AM IST

సాహస క్రీడలకు ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండివాగు సమీపంలోని గాయత్రి జలపాతం వేదికైంది. డిసెంబర్‌లో ఇక్కడ జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించనున్నట్లు తెలంగాణ అడ్వెంచర్‌ క్లబ్‌ వ్యవస్థాపకులు రంగారావు పేర్కొన్నారు. జాతీయస్థాయి సాహస క్రీడలు నిర్వహించేందుకుగాను ముందస్తుగా గాయత్రి జలపాతంలో ఈ సన్నాహక క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం 20 మంది సాహసికులు సన్నాహక పోటీల్లో పాల్గొన్నారు. కడప, కర్నూల్‌, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన వారు పోటీపడ్డారు. జలపాతం వద్ద వాటర్‌ రాఫెల్లింగ్‌, ట్రెక్కింగ్‌తో పాటు కడెం నదిలో రాఫ్టింగ్‌ చేశారు. ఈ సందర్భంగా సాహస క్రీడలు తిలకించేందుకు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఎత్తైన రాతి శిలలపై నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహ ధారల మీదుగా సాహస క్రీడలను చేపట్టారు. గాయత్రి జలపాతానికి సరైన రోడ్డు మార్గాన్ని వేయిస్తే బాగుంటుందన్నారు. పర్యటకంగా సాహస క్రీడలకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉందని క్లబ్‌ వ్యవస్థాపకులు రంగారావు తెలిపారు.

జాతీయ స్థాయి క్రీడలు.. నదిలో రాఫ్టింగ్‌

ఇదీ చూడండి : తల్లైన పెంపుడు కుక్క... పురుడు పోసిన యజమాని

Intro:tg_adb_91_13_sahasakreedalu_gayatriwaterfall_ts10031

Body:ఏ.లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ 9490917560...
గాయత్రి జలపాతంలో జాతీయ స్థాయి సాహస సన్నాహక క్రీడలు
*తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో ఆసక్తిగా సాగిన సాహస క్రీడలు
...
( .):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ప్రముఖ గాయత్రి జలపాతంలో సాహస క్రీడలు అద్భుతంగా జరిగాయి తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జాతీయ స్థాయి సాహస సన్నాహక క్రీడాపోటీల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి 20 మంది సాహస క్రీడాకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు బోటింగ్ రాఫ్టింగ్, వాటర్ రాపేలింగ్, ట్రక్కింగ్ తదితర అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు సాహస క్రీడలు తిలకించేందుకు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఎత్తయిన రాతి శిలలపై నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహ ధారల మీదుగా సాహస క్రీడలను నిర్వహించారు. రాతిశిలల పై నుంచి చేసిన సాహసాలు అందరినీ ఆకట్టుకొంది ఈ సందర్భంగా తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ రాష్ట్ర అధ్యక్షుడు కే రంగారావు మాట్లాడుతూ డిసెంబర్ మాసంలో జాతీయస్థాయి సాహస క్రీడలు నిర్వహించేందుకు గాను ముందస్తుగా గాయత్రి జలపాతంలో ఈ సన్నాహక క్రీడలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఇటీవల వర్షాలు అధికంగా ఉండడంతో క్రీడాకారులు పెద్దఎత్తున రాలేక పోయారని పేర్కొన్నారు గాయత్రి జలపాతానికి సరైన రోడ్డు మార్గాన్ని వేయిస్తే బాగుంటుందని, పర్యాటకంగా బాగుందని ,సాహస క్రీడలకు అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు.

Conclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.