ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో దండారి సంబురాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. గూడాల్లోని ఆదివాసీలు సాంప్రదాయబద్ధంగా వైభవోపేతంగా సంబురాలు నిర్వహించుకుంటున్నారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆదివాసీలు దండారి సంబురాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా గుస్సాడి వేషధారణదారులతో కలిసి వాద్యాలకు అనుగుణంగా దండారి దింసా ఆడిపాడారు. దీపావళి వరకు ఈ సంబురాలు నిర్వహించుకుంటామని ఆదివాసీ పెద్దలు తెలిపారు.
ఇదీ చదవండి: 'నిజాంను స్ఫూర్తిగా తీసుకుని పాలన సాగిస్తున్న కేసీఆర్'