ఆదిలాబాద్ జిల్లా కేంద్రం శివారులోని బెల్లూరి అయ్యప్ప ఆలయంలో మాలాధారులకు ఓ ముస్లిం సోదరుడు భిక్ష ఏర్పాటు చేసి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యూనిస్ అక్బానీ... మతపెద్దలతో కలసి అయ్యప్ప స్వాములకు భోజనం వడ్డించారు. వారితో కలసి సహపంక్తి భోజనం చేశారు. "హిందూ-ముస్లిం భాయ్ భాయ్" అన్న నినాదాన్ని నిజం చేసేదిశగా చేపట్టిన కార్యక్రమం ఇతరులకూ స్ఫూర్తిగా నిలవాలని మతపెద్దలు అకాంక్షించారు.
ఇవీ చూడండి: బగ్దాద్ విమానాశ్రయంపై రాకెట్ దాడి-8మంది మృతి