KCR appreciates Mukhara village: రాష్ట్రంలో పల్లెలు ప్రగతిపథంలో సాగుతున్నాయని తెలిపేందుకు ముఖరా-కె గ్రామమే నిదర్శమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం ఆదిలాబాద్ జిల్లా ముఖరా-కె ను ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ ఊరిలో సేకరించిన చెత్తను వర్మికంపోస్టు ఎరువుగా మార్చుతున్నారు. అలా ఆదాయం నుంచి లక్ష రుపాయలను ముఖ్యమంత్రి సహాయనిధి ముఖరా-కె గ్రామస్థులు విరాళంగా ఉచ్చారు.
గ్రామంలో సేకరించిన తడిచెత్త ద్వారా వర్మికంపొస్ట్ తయారు చేసి 7లక్షల ఆదాయాన్ని సంపాదించడం అద్భుతమని అభినందించారు. తమకు ఆదాయం వచ్చిన 7 లక్షల్లో ... 4 లక్షల రూపాయలు సొలార్ గ్రిడ్, 2 లక్షలతో డిజిటల్ లైబ్రరి ఏర్పాటు చేసినట్లు ముఖరా సర్పంచ్ మీనాక్షి తెలిపారు. మిగతా లక్ష రూపాయలు సీఎం సహాయనిధికి ఇచ్చినట్లు చెప్పారు.
ఇవీ చదవండి: