రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదిలాబాద్ భాజపా ఎంపీ సోయం బాపురావు తన స్వగృహంలో రైతు దీక్ష చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతుల జొన్న పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆత్మహత్య చేసుకున్న బోధ్ మండలం కనుగుట్ట రైతు కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, తదితరులు దీక్షలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి : రానున్న మూడురోజులు రాష్ట్రానికి వర్షసూచన