ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మొక్రా(కే) గ్రామంలో గ్రామస్థులు హరితహారం కార్యక్రమం నిర్వహించి వెయ్యి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణకు తనవంతుగా ఏడాదికి రూ. 50 వేల చొప్పున నీళ్లకోసం ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామానికి సంబంధించిన రోడ్డు వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు గ్రామస్థులందరూ కృషి చేయడం అభినందనీయమన్నారు.
ఇవీ చూడండి: '50 అడుగులకు చేరనున్న గోదావరి నీటిమట్టం'