ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాపురావు పాల్గొన్నారు. 56 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు అందించారు.
తెరాస ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని ఎమెల్యే పేర్కొన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్, రైతు బీమా, పెట్టుబడి సాయం అందజేస్తూ దేశంలోనే ఆదర్శ ప్రభుత్వంగా నిలుస్తుందని వెల్లడించారు.