ETV Bharat / state

గిరిజన ఆచారాలకు ప్రతీక నాగోబా జాతర: సత్యవతి రాఠోడ్ - తెలంగాణ వార్తలు

నాగోబా జాతరను పురస్కరించుకొని మంత్రి సత్యవతి రాఠోడ్ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సంప్రదాయాలకు ఈ జాతర ప్రతీక అని అన్నారు. జాతరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి వివరించారు.

minister-satyavathi-rathod-about-nagoba-jatara-in-adilabad-district
గిరిజన ఆచారాలకు ప్రతీక నాగోబా జాతర: సత్యవతి రాఠోడ్
author img

By

Published : Feb 11, 2021, 3:25 PM IST

ఆచార, సంప్రదాయాలకు గిరిజనులు ఇచ్చే ప్రాముఖ్యతకు నాగోబా జాతర అద్దం పడుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర మరికొద్ది గంటల్లో మహాపూజతో ప్రారంభమవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నాగోబా జాతర ఆదిమ గిరిజనుల ప్రాచీన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో సంప్రదాయాలకు విలువనిస్తూ అన్ని పండుగలను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గొప్పగా నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. నాగోబా జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతోందని గుర్తు చేశారు. కరోనా నేపథ్యంలో గిరిజన దర్బార్, క్రీడా పోటీలను రద్దు చేసినట్లు మెస్రం వంశీయులు ప్రకటించారని మంత్రి వెల్లడించారు.

ఆదివాసీల ఆరాధ్య దైవమైన ఆదిశేషును దర్శించుకునేందుకు అక్కడికి వెళ్లేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు. అధికారులు జాతరను పర్యవేక్షిస్తారని తెలిపారు. విశిష్టమైన నాగోబా జాతర రాష్ట్రంలో జరుగుతున్నందుకు ఎంతో గర్విస్తున్నామని మంత్రి అన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.