ETV Bharat / state

బహుదూరపు బాటసారికి.. ఎంత కష్టం! - migrants request police to send them to their hometown in adilabad

లాక్​డౌన్​ వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్​ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మధ్యప్రదేశ్​, రాజస్థాన్​ వెళ్తోన్న వారిని పోలీసులు ఆదిలాబాద్​లో ఆపివేశారు.

migrants request police to send them to their hometown in adilabad
బహుదూరపు బాటసారికి.. ఎంత కష్టం!
author img

By

Published : Apr 15, 2020, 1:00 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఇరుక్కుపోయిన వలస జీవులు తమ సొంత ప్రాంతాలకు పంపించాలని అధికారులను వేడుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆదిలాబాద్‌ మీదుగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలకు వెళ్తుండగా అధికారులు వీరిని ఇక్కడే నిలిపివేశారు.

జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్‌, బీసీ వసతిగృహం, కస్తూర్బాగాంధీ విద్యాలయం, తాంసి బస్టాండ్‌, రిమ్స్‌ ఆసుపత్రి ప్రాంగణాల్లో ఉన్న నిరాశ్రయుల కేంద్రాల్లో వీరికి ఆశ్రయం కల్పించిన అధికారులు దాతల సాయంతో మూడు పూటలా భోజనం పెడుతున్నారు. తమ కుటుంబ సభ్యులను చూడాలని ఉందని.. సొంత ప్రాంతాలకు పంపించాలని అధికారులను వారు వేడుకుంటున్నారు.

పిల్లలను చూడాలని ఉంది

మా సొంత గ్రామంలో తల్లిదండ్రులతో పాటు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హైదరాబాదులో కూలీ పనిచేస్తున్న తాను లాక్‌డౌన్‌ నేపథ్యంలో సొంత ఊరికి బయలుదేరే క్రమంలో ఇక్కడ నిలిపివేశారు. ఇద్దరు పిల్లలు చాలా చిన్న వారు. పక్షం రోజుల నుంచి ఇక్కడే ఉండటంతో వారు ఎలా ఉన్నారోననే బెంగగా ఉంది. వారిని చూడాలని ఉంది.

- బ్రిజేష్‌కుమార్‌, బెండ్‌ జిల్లా, మధ్యప్రదేశ్‌

సొంత గ్రామంలో నాకు భార్య, మూడు నెలల కుమారుడు ఉన్నారు. కూలీ పని నిమిత్తం హైదరాబాద్​కు

రాగా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మా ఊరికి వెళ్లే మార్గంలో ఇక్కడ నిలిపివేశారు. పదిహేనురోజులకుపైగా కావస్తోంది. నా భార్య, బాబును చూడాలని ఉంది. అధికారులు పంపించే ఏర్పాట్లు చేయాలి.

- శంకర్‌చౌదరి, బాలాగాట్‌ జిల్లా, మధ్యప్రదేశ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.