ఇటీవల రాష్ట్రంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం నేపధ్యంలో క్షేత్రస్థాయి పోలీసులకు లాఠీ డ్రిల్ తర్ఫీదుకు ఆ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా ఆయా విభాగాల్లో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బందిని విడతలవారీగా ఎంపిక చేస్తోంది.
ప్రధానంగా ఏఆర్, సివిల్, స్పెషల్ బ్రాంచి, డీసీఆర్బీ, ఐటీకోర్, ఫింగర్ ప్రింట్, యూనిట్, షీంటీం, రక్షక్ మొబైల్ విభాగాల్లో పని చేసే కానిస్టేబుళ్లు మొదలుకొని ఏఎస్ఏ కేడర్ వరకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆదిలాబాద్‌లోని పోలీసు కవాతు మైదానంలో అదనపు ఎస్పీ వినోద్ కుమార్ నేతృత్వంలో సిబ్బందికి ఇన్ స్పెక్టర్ వేణు, ఏఆర్ ఎస్ఎ మహమ్మద్ ఫారూఖ్, మహేశ్ కుమార్ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
ఇదీ చదవండి: వ్యర్థాలే కదా అని వదిలేయలేదు...