ETV Bharat / state

ప్రతి పల్లె ఆ గ్రామంలా కావాలని కేసీఆర్‌ సూచన - కేంద్ర జలవనరుల శాఖ స్వచ్చ భారత్ మిషన్

రాష్ట్రంలో 100 శాతం బహిరంగ మలవిసర్జన రహితహోదాను సాధించిన... ఏకైక గ్రామపంచాయతీగా అదిలాబాద్ జిల్లాకు చెందిన ముఖ్రా.కె గ్రామం నిలిచింది. కేంద్ర జలవనరుల శాఖ స్వచ్ఛభారత్ మిషన్ కింద ఈ గ్రామాన్ని ఎంపిక చేసింది. ఈ తరుణంలో ఆ గ్రామ సర్పంచ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్​ను కలిశారు.

KCR's suggestion every village should be like the mukhra k village
ప్రతి పల్లె ఆ గ్రామంలా కావాలని కేసీఆర్‌ సూచన
author img

By

Published : Dec 8, 2020, 3:33 AM IST

తెలంగాణలో నూటికి నూరు శాతం బహిరంగ మల విసర్జన రహిత హోదాకు ఓ గ్రామ పంచాయతీ ఎంపికైంది. కేంద్ర జలవనరుల శాఖ స్వచ్చ భారత్ మిషన్ కింద ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముఖ్రా.కె గ్రామాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, తదితర ప్రజా ప్రతినిధులు ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్‌ను కలిశారు.

ముఖ్రా.కె గ్రామం బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా ఎంపిక అవ్వడం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. తాను కన్న కలలు ఈ గ్రామం ద్వారా నిజమవుతున్నాయని... ముఖ్రా.కె గ్రామ సర్పంచ్ గాడ్గె మినాక్షి, అధికారులను కేసీఆర్ అభినందించారు.

గ్రామంలో వంద శాతం మొక్కలు బతకడం గొప్ప పరిణామమని అన్నారు. సేంద్రియ ఎరువులు తయరు చేస్తున్న తొలి గ్రామం ముఖ్రా.కె కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇతర గ్రామాలు సైతం ఈ మాదిరిగా తయారవ్వాలని సీఎం సూచించారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలి: కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.